London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ధర్మవరం ఆర్టీసీ డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరి సహాయ సహకారాలు అవసరం

… ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరి సహాయ సహకారాలు అవసరం ఉంటుందని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత సేవలు తప్పక అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి చెన్నైకు వెళ్లే ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో మేనేజర్ సత్యనారాయణ, రీజనల్ మేనేజర్ మధుసూదన్ల ద్వారా డిపో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం పుట్టపర్తి నుండి కేవలం ఒక బస్సు మాత్రమే చెన్నైకి వెళ్లేదని, నేడు ధర్మవరం నుండి చెన్నైకి నూతన సర్వీస్ బస్సును నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, సంబంధిత అధికారులకు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ధర్మవరం నుండి ఉదయం 8 గంటలకు బస్సు బయలుదేరి తిరిగి మరుసటి రోజు 6 గంటలకు చేరుతుందని, అక్కడ తిరిగి ఆరు గంటలకు బయలుదేరి ధర్మారానికి మరుసటి రోజు 8 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ చెన్నై సర్వీసు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం నుండి తిరుపతికి రెండు బస్సులు కూడా ఉండడం నిజంగా ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్లను రిజర్వు చేసుకునే అవకాశం కూడా ఉందని, కార్గో ద్వారా తిరుపతికి చెన్నైకు వ్యాపారస్తుల కు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ధర్మారం నుంచి చెన్నైకి కదిరి, మదనపల్లి, తిరుపతి మీదుగా వెళుతుందని తెలిపారు. తిరుమల తిరుపతికి వెళ్లే భక్తాదులు కూడా ఈ బస్సు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ డిపోను ఆదాయ బాటలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రీజినల్ మేనేజర్ మధుసూదన్ స్థానిక డిపో మేనేజర్ సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, చేనేత నాయకురాలు జయశ్రీ, బిజెపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సంద రాఘవ, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img