London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలి

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలే కానీ పనిలో కాదు

-మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర అనంతపురం : నాణ్యమైన విద్య.. మనందరి నినాదం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఎంఈఓలకు ఉద్బోధించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని నేను బడికి పోతా, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్ మరియు ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఎంఈఓలు ఒకే స్థాయి పనితీరు కనబరిచాలని, వారి పనితీరు మరింత మెరుగుపడాలని ఆదేశించారు. పనితీరులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. కే.జి.బి.వీలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువ ఉందని, ప్రతి ఏడాది తగ్గుతోందని, ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం మరింత పెంచాలని ఆదేశించారు. “నేను బడికి పోతా” కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలేకానీ పనిలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. పామిడి మండలంలో 87 హ్యాబిటేషన్లలో, ఉరవకొండ మండలంలో 84 హ్యాబిటేషన్లలో ఈ కార్యక్రమం కింద చేపట్టగా, సెట్టూరు మండలంలో కేవలం ఒక హ్యాబిటేషన్ లో ఈ కార్యక్రమం చేపట్టారని, అలా ఎక్కువ తక్కువ కాకుండా అన్ని మండలాల్లోనూ పూర్తిగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం కింద మొత్తం 3,356 మందిని గుర్తించగా, ఉరవకొండలోనే 1,617 మందిని గుర్తించారని, మిగిలిన చోట్ల ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ కింద బుక్కరాయసముద్రంలో మాత్రమే ముగ్గురిని గుర్తించారని, మిగిలిన చోట్ల గుర్తించలేదని, చిన్నారుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా వచ్చేవారంలోపు 100 శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. బడిలో చదవాల్సిన పిల్లలు చదువుకునేలా జిల్లా అంత ఈ కార్యక్రమం చేపట్టాలని, కానీ కొన్ని మండలాలే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశాయి తప్ప మిగతా మండలాలు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. ఇకనుండి ప్రతిరోజు రిపోర్టును పంపాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద పోస్టర్ల ఆవిష్కరణ, డాక్యుమెంటరీ ఫిల్మ్ లను చేపట్టాలన్నారు.
అకడమిక్ మానిటరింగ్ వింగ్ కింద జ్ఞాన జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎస్జిటీలు, అంగన్వాడీ టీచర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ చేపట్టాలన్నారు. జ్ఞాన ప్రకాష్ రిఫ్రెషర్ శిక్షణ కింద ప్రతి ఒక్కరికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, లక్ష్యం నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నాటికి శిక్షణ కేంద్రంలో పనులు మొదలు కావాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అమలులో భాగంగా విద్య అవగాహన శిబిరాలు నిర్వహించడం, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, విద్య మరియు సౌకర్యాలు ప్రాముఖ్యతను పోస్టర్ల ద్వారా, డాక్యుమెంటరీ లు, గతంలో పాఠశాలలో చదివి ప్రయోజకులుగా ఉన్న వారిని ఆదర్శంగా చూపుతూ, పిల్లల తల్లితండ్రులకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు అందుబాటులో ఉండే విద్యా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సోషియల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క గ్రామాలు, మండలాల వారిగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో విద్యార్థులకు కిట్ల పంపిణీకి సంబంధించి నోట్ పుస్తకములు పంపిణీ పూర్తి కాగా, మిగిలిన యూనిఫామ్స్, బ్యాగ్, బెల్ట్స్, డిక్షనరీలు, బూట్లు, టెస్ట్ బుక్ లు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. పీఎంశ్రీ స్కూల్స్ సంబంధించిన పనులు ఏ స్థితుల్లో ఉన్నవి, పనులు ఆగిపోయాయి, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. నాడు – నేడు పాఠశాల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలపగా, ఎన్ని బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లుల జాబితాను తయారుచేసి ఇవ్వాలని తెలిపారు.
జిల్లాలో 1,694 పాఠశాలల్లో 1,87,954 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకానికి వంట మనుషులు లేరు అనేది ఉండడానికి వీలులేదని, ఎక్కడైనా సమస్య వచ్చిన 24 గంటల్లోపు పరిష్కరించాలని డిఈఓని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో బయటికి వచ్చి తిని వెళ్లడం లాంటివి ఉండరాదని, పాఠశాలల్లోనే భోజనం అందించాలన్నారు. పాఠశాల వేళలో పిల్లలు బయటికి వెళ్లకుండా చూడాలని, నిబంధనలను అతిక్రమించరాదన్నారు. పిల్లలతో ఎక్కడా పని చేయించకుండా చూడాలన్నారు. ప్రతి నెల 15వ తేదీలోపు బిల్లులు సబ్మిట్ చేయాలని, బిల్లుల సబ్మిట్ ఆలస్యం అయితే చర్యలు తీసుకోవడానికి వెనకాడమన్నారు. చిన్నారులకు అందించే చిక్కీల గడువు తేదీని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతినెలా డిఈఓ, సమగ్ర శిక్ష, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ రెసిడెన్షియల్, తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
విద్యాశాఖలో క్యాడర్ వారీగా అధికారుల స్థాయి నుంచి వాచ్మెన్ వరకు ఖాళీల వివరాలను మొత్తం ఎక్స్ఎల్ సీట్లో అందించాలన్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి లెటర్ పంపించాలన్నారు. మండల స్థాయిలో ఎంఈఓలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, కేజీబీవీ ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో డీఈవో వరలక్ష్మి, విద్యాశాఖ ఏడీలు కృష్ణయ్య, నాగరాజు, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, సీఎంవో గోపాల్, జిసిడివో వాణిదేవి, కార్యాలయం సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఎంఈవో 1, 2లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img