Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

కిసాన్‌ రైల్‌ ఏమైంది?

అరుణ్‌కుమార్‌ శ్రీ వత్సవ

అనేక ప్రాజెక్టులను అట్టహాసంగా ప్రారంభించి ఆ తర్వాత వాటిని మరిచిపోవడం ప్రధాని నరేంద్రమోదీకి బాగాఅలవాటైంది. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను సిద్ధం చేయకుండానే హడావుడిగా ప్రారంభించడం కూడా మనం చూడవచ్చు. 201920 బడ్జెట్‌లో కిసాన్‌ రైల్‌ పథకాన్ని ప్రకటించారు. 2020లో మొదటి రైలును ప్రారంభించారు. ఇప్పుడీ ప్రాజెక్టు ఏస్థాయిలో ఉందో వెతుక్కోవలసిందే. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కిసాన్‌ రైల్‌ పథకం ప్రారంభించారు. రైతులకు మేలు జరిగే ఈ పథకం గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. కిసాన్‌రైలు సేవలు ఎలాఉన్నాయన్న అంశం గురించి 2023 మార్చి 29 రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ వివరించారు. 2020 ఆగస్టు 7న కిసాన్‌రైలు సర్వీసు ప్రారంభించి 2023 మార్చి ఒకటవతేదీ నాటికి 167 రూట్లలో దాదాపు 2,364 రైల్వే సర్వీసులను నడిపిందని పార్లమెంటులో తెలియజేశారు. పండ్లు, కూరగాయల రవాణాను ప్రోత్సహించడానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వశాఖ రవాణా సబ్సిడీ కింద 50శాతం అందించిందని మంత్రి వెల్లడిరచారు. 202021, 2021`2022 ఆర్థిక సంవత్సరాలలో సబ్సిడీలను అందించారు. మొదటి సంవత్సరంలో రు.27.79కోట్లు, రెండో సంవత్సరంలో రు.121.86 కోట్లు అందించింది. ఆ తర్వాత సంవత్సరం రు.50కోట్లు మాత్రమే ఇచ్చింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి సబ్సిడీని రద్దు చేసింది. సబ్సిడీ ర్దుచేయడమేగాక రైల్వేలు పాక్షికంగా మద్దతిస్తున్నాయి. 2021 ఏప్రిల్‌ 1 నుంచి, 2023 మార్చి 1వ తేదీ మధ్యకాలంలో కేవలం రు.4కోట్లు మాత్రమే రైల్వేలు సబ్సిడీగా ఇచ్చాయి.
ఆకస్మికంగా సబ్సిడీ రద్దుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ పథకం ప్రారంభించడానికి ముందు తగినంతగా క్షేత్రస్థాయి ఏర్పాట్లు జరగకపోవడం కారణం అని నిపుణులు చెప్తున్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా రోడ్గు మార్గం ద్వారానే రవాణా చేస్తున్నారు. పొలాలనుంచి తరలించడానికి వివిధరకాల వాహనాలు వినియోగిస్తున్నారు. అయితే దేశంలో వివిధప్రాంతాలకు పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి రైల్వేల ద్వారా అయితే ఖర్చు తక్కువగా ఉంటుందని రైతులు ఆశించి, ఈ విధానాన్ని అనుసరించారు. అయితే కిసాన్‌రైలు పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసి రైతులను నిరాశ పరిచింది. అంతేకాదు, టిక్కెట్ల భారం పెంచే రైళ్లను ప్రవేశపెట్టి సామాన్యప్రజలకు రైలు ప్రయాణం అందకుండా చేశారు. సాధరణ బోగీలను బాగా తగ్గించారు. వస్తు రవాణాను ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి దూరంగా ఉన్న బీహార్‌కు లేదా పశ్చిమబెంగాల్‌ పంపడానికి రోడ్డు మార్గం కంటే రైలుద్వారా పంపడానికి ఖర్చు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే రైతులు తగినరీతిలో అధికారులను సంప్రదించడంలేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రైతు సంఘాలు, సహకార సొసైటీలతో సంప్రదించి కనీసం దూరప్రాంతాలకైనా వస్తు రవాణా కొనసాగించవచ్చు. రవాణాకు రైతులు సబ్సిడీలమీద ఆధార పడకూడదని వాదించేవాళ్లున్నారు. వాణిజ్యపరంగా మేలుగా ఉంటే ఈ పతకం విజయవంతమయ్యేదని కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపాలున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కిసాన్‌రైలు పథకం విఫలమై ఆధునిక వ్యవసాయం గణనీయంగా వెనుక పట్టుపట్టింది. నిపుణుల కమిటీ ఈ ప్రయోగంపై సమీక్షించి మరింత సమర్థవంతమైన అమలు వ్యూహాన్ని సిఫారసుచేసి ఉండవలసింది. సరైన క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలను రూపొందించి ఉండవలసిందని కొందరు చెప్తున్నారు. అలాగే కృషి ఉడాన్‌ పథకాన్ని అక్టోబరు 2021 ప్రారంభించారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయల రవాణాకు ఈ పథకం ఉద్దేశించింది. కిసాన్‌ ఉడాన్‌ పథకం వ్యవసాయరంగం వృద్ధికోసమే ప్రవేశపెట్టారు. రైతులు దేశవ్యాప్తంగా వస్తువుల రవాణాకు విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పథకం ప్రజలకు అంతగా తెలియని పరిస్థితిఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img