విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : పెద్దకడుబూరుకు వచ్చే ఆర్టీసీ బస్సు ఎప్పుడు రిపేరికి వస్తుందో అర్థం కావడం లేదు. గురువారం విద్యార్థుల కోసం పెద్దకడబూరుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఆదోనికి వెళుతూ రంగాపురం గ్రామం వద్ద ఆగిపోయింది. ఎంతసేపటికీ స్టాట్ కాకపోవడంతో విద్యార్థులు బస్సును వెనుక నుంచి తోయడం మొదలు పెట్టారు. దీంతో విద్యార్థులకు ఆర్టీసీ బస్సు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మంచి కండిషన్ లో ఉన్న బస్సులను నడపాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.