ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్- ప్రశాంతి
విశాలాంధ్ర ధర్మవరం:: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య అందరికీ స్ఫూర్తిదాతగా నిలిచారని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల నడుమ, ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లాలో జన్మించడం జరిగిందని, 1921 బెజవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన తయారుచేసిన జెండాను తొలిసారి ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ కొన్ని మార్పులతో ఆయన రూపొందించిన జాతీయ జెండాను ఆమోదించడం జరిగిందని తెలిపారు. భారతదేశానికి ఒక జాతీయ పతాకము అనే ఆంగ్ల గ్రంధాన్ని రచించింది వెంగయ్య నని తెలిపారు. బెజవాడలో 1963 జులై 4వ తేదీన వారు మృతి చెందడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుటలో అందరూ ఐక్యమత్యంతో ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్. పిఓ- కుల్లాయి రెడ్డి, కళాశాల అధ్యాపకులు, బోధనీతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.