విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్న దృష్ట్యా శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన గల అన్న క్యాంటీన్లను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పేద ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేసే పలు కౌంటర్లను వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లను త్వరగా దగ్గరుండి ఏర్పాటు పూర్తి చేసిన టిడిపి పట్టణ అధ్యక్షుడు జేసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్‌కుమార్, టిడిపి నాయకులు భీమనేని ప్రసాద్ నాయుడు, మాధవరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.