విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరం పట్టణం రాంనగర్ కు చెందిన చేనేత కుటుంబానికి చెందిన బాలం సాలమ్మ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినారు.వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల వారికి రంగరాజు శిల్క్ హౌస్ యజమాని బండారు నాగరాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు జింక చంద్రశేఖర్, సాకే. ఓబిలేసు ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, చింతా మంజునాథ,గరుగు. మల్లికార్జున, నాగరాజు, గోవిందా చారి, దాము, ముత్యాల గౌడ్, నబి రసూల్ తదితరులు పాల్గొన్నారు.