Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రోహిత్‌తో విభేదాలే అసలు కారణమా?

న్యూదిల్లీ : టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడం చర్చనీయాంశం కాగా పీటీఐలో వచ్చిన ఓ సంచలన వార్త మరింత ఆసక్తిని రేకెత్తించింది. పరిమిత ఓవర్ల (వన్డే ఫార్మాట్‌) జట్టు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పించాలని కోహ్లీ బీసీసీఐని డిమాండ్‌ చేశాడన్నది ఆ వార్త సారాంశం. రోహిత్‌ వయసు 34 ఏళ్లని, అతడిని పక్కన పెట్టి వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌కు, టీ20ల్లో రిషబ్‌ పంత్‌ కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని విరాట్‌ కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సెలక్షన్‌ కమిటీకి చెప్పగా.. అది కాస్తా బోర్డు దృష్టిలో పడి కోహ్లీపై అసంతృప్తికి కారణమైందట. ఓ సక్సెస్‌ఫుల్‌ ఆటగాడిని కోహ్లీ గుర్తించలేకపోవడంపై వారు ఒకింత నిరాశ చెందారట. రోహిత్‌ నిజమైన లీడర్‌ అని, జట్టులో చాలామంది ఇప్పటికీ రోహిత్‌ సలహాలను పాటిస్తారని ఓ అధికారి చెప్పారు. యువ ఆటగాళ్లను అతడు బాగా ప్రోత్సాహిస్తాడని వెల్లడిరచారు. టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం, 2019 వన్డే ప్రపంచకప్‌లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమూ కోహ్లీ కెప్టెన్సీపై అసంతృప్తికి కారణమయ్యాయి. పీటీఐ కథనం నేపథ్యంలో కోహ్లీ-రోహిత్‌ మధ్య మనస్పర్థలు మరోసారి చర్చకు వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img