London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, నకార్డ్ ) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా ప్రతి పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాల విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించాలని, డ్రగ్స్ వాడడం వల్ల కలిగే వ్యతిరేక ప్రయోజనాలు ఏంటి అనేదానిపై తెలియజేయాలన్నారు. జిల్లాలో అన్ని మెడికల్ షాపుల్లోనూ సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, 1,220 మెడికల్ షాపులు ఉండగా, 270 మెడికల్ షాపుల్లో సీసీటీవీ కెమెరాలు లేవని, అన్నిటినీ తనిఖీ చేయాలని, అన్నిచోట్ల కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్సి, ఎస్టీ హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డి-అడిక్షన్ వార్డులో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఎక్కడైనా డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తున్నారా అనే దానిపై తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, లాంటివి సాగు, రవాణా చేయకుండా చూడాలన్నారు. వాటిని ఉపయోగించకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గ్రామాల వారిగా వాహనం ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే దుష్పరిమాణాలపై వీడియోలను ప్రదర్శించాలన్నారు. అన్ని పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నో డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు అక్రమ రవాణా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఆర్డీవోలు వసంత బాబు, వి.శ్రీనివాసులు రెడ్డి, డిటిసి వీర్రాజు, డిఎంహెచ్ఓ డా.ఈ బి.దేవి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాణిక్యరావు, డివీఈఓ వెంకటరమణ నాయక్, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ శేషాద్రి, డీఎస్పీ ప్రతాప్, హార్టికల్చర్ డిడి నరసింహారావు, జిల్లా సిరికల్చర్ అధికారి ఆంజనేయులు, కలెక్టరేట్ ఏవో మారుతి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img