Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

మున్సిపల్ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి

యుటిఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ
విశాలాంధ్ర ధర్మవరం;; అక్టోబర్ రెండున శ్రీ సత్యసాయి జిల్లాలో గల అన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నట్లు యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులుసెట్టిఫీ జయ చంద్రారెడ్డి, ఎం. సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సత్య సాయి జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం ధర్మవరం పట్టణం స్థానిక యుటిఎఫ్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, శెట్టిపి జయ చంద్ర రెడ్డి, M సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి సుమారు 10 సం.లు కావస్తున్న,ఈ నాటికీ ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ ఉపాధ్యా యులకు వర్తించే అన్ని సౌకర్యాలు, ఉత్తర్వులు, ఇదే విద్యా వ్యవస్థలో ఉన్న మున్సిపల్‌ టీచర్లకు మాత్రం వర్తించడం లేదు అని తెలిపారు.
మున్సిపల్‌ హైస్కూల్స్‌లో ఇప్పటికీ తగినంత మంది సబ్జెక్టు టీచర్లు లేరు. 3,4,5 తరగతులను విలీనం చేశారే తప్ప పరిష్కార మార్గాలు లేవని,ఆ తరగతులు బోధించడానికి స్కూల్‌ అసిస్టెంట్‌ లను ఇవ్వలేదు అని,ప్రమోషన్లు, బదిలీలు కూడా రెగ్యులర్‌గా జరగడం లేదని మండిపడ్డారు. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు అని, ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ టీచర్లకు ఇచ్చినట్లే మున్సిపల్‌ టీచర్లకు అర్బన్‌ ఎంయిఓ పోస్టులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ ఖాతాలు మున్సిపాలిటీలలో నిరుపయోగంగా పడి ఉన్నాయని,జీతాల నుండి మినహాయించే సొమ్ము వారి ఖాతాలకు జమ చేసేందుకు గాని, ఖాతాలలో ఉన్న సొమ్ము అవసరాలకు వినియోగించు కునేందుకు గాని అవకాశం లేకుండా పోవడం దారుణం అన్నారు.ఈ సమస్యలపై ఎన్నిమార్లు ప్రాతినిధ్యం చేసినా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ టీచర్ల ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతున్నది అని,ఈ నేపథ్యంలో వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 న సత్యసాయి జిల్లాలో అన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మున్సిపల్‌ హైస్కూళ్ళలో తగినంత మంది సబ్జెక్టు టీచర్లను నియమించేందుకు వీలుగా ఎస్‌జిటి, పండిట్‌, పియిటి పోస్టులను అప్‌ గ్రేడ్‌ చెయ్యాలి అని, నవంబర్‌ లోగా అప్‌గ్రేడెడ్‌ పోస్టులలో మున్సిపల్‌ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, మున్సిపల్‌ ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైన వారిని అర్బన్‌ ఎంయిఓలుగా నియమించాలి అని, మున్సిపల్‌ టీచర్లకు జిపిఎఫ్‌ ఖాతాలు తెరిపించాలి అని తెలిపారు. తదుపరి మున్సిపల్‌ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించేలా తగిన చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.మున్సిపల్‌ టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, సహధ్యక్షులు బాబు, సీతా మహా లక్ష్మి, కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్ మారుతీ, శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు తహీర్ వలీ, శివ శంకర్, హరి కృష్ణ, రమీజాభి, లక్ష్మి నారాయణ, నరేష్, సుబ్బారెడ్డి జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ మహంతెశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img