London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ఏ పి లో పప్పు సెనగ సబ్సిడీ 50 శాతానికి పెంచాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్

విశాలాంధ్ర- అనంతపురం : రాష్ట్రంలో విత్తన పప్పు సేనగ ధరను ప్రభుత్వం 94 రూపాయలుగా నిర్ణయించి, 25% సబ్సిడీతో 70 రూపాయల 50 పైసలుగా నిర్ణయించిందన్నారు. ఓపెన్ మార్కెట్ ధరతో పోలిస్తే కేవలం ఏడు రూపాయల 50 పైసలు మాత్రమే రైతులకు సబ్సిడీ గా దక్కుతుంది అన్నారు. ప్రభుత్వం మార్కెట్ ధరను 94 లెక్కించి 25% సబ్సిడీతో 7 రూపాయల 50 పైసలకు కేజీ ఇవ్వడం రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చదు. అందువల్ల పప్పు శనగ సబ్సిడీని 50 శాతానికి పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సీ జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓపెన్ మార్కెట్ ధరపై 25 శాతం సబ్సిడీ ఇస్తే ఆరు రూపాయల లోపల లభించేది. రైతుకు వంద కేజీలు మాత్రమే సబ్సిడీతో ఇస్తున్నారు. మిగిలిన సరుకు ఓపెన్ మార్కెట్ లో కొనాల్సిందే అని పేర్కొన్నారు . రాష్ట్రంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాలో లక్షల ఎకరాలలో పప్పు శనగ పంట వేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి అనంతపురము, సత్యసాయి జిల్లాలో లక్ష ఎకరాలకు పైబడి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు సరిపడే విత్తన పప్పు శనగ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img