విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : మండలంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్సైగా ధరణి బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా తనకల్లు మండలం నుంచి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లోలో ధరణి బాబు ఎస్సైగా విధులు నిర్వహించారు.