విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఈ నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలు లో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగ పోటీలకు చోడవరం నుండి ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు పతంజలి యోగ శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు గొంతిన లయ వర్ధన్, పొట్నూరు పవన్ కుమార్ లున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలాని పలువురు అభినందనలు తెలియజేసారు.