విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా) : మండలంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా ధరణి బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఎస్సై ధరణి బాబుకు శాలువా కప్పి పూలమాలవేసి, స్వీట్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు ఏఐటియుసి నాయకులు ఉమా గౌడ్, రవి పాల్గొన్నారు.