Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

ఎంపీడీవో కార్యాలయమునకు మంచి గుర్తింపు తెచ్చేలా అధికారులు తమ విధులు నిర్వర్తించాలి..

నూతన ఎంపీడీవో. ఎస్. సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఎంపీడీవో కార్యాలయమునకు మంచి గుర్తింపు తెచ్చేలా అధికారులు సిబ్బంది తమ విధులను నిర్వర్తించాలని నూతన ఎంపీడీవో ఎస్. సాయి మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎంపీడీవో కార్యాలయంలో వారు ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. వీరి సొంత ఊరు కనేకల్లు మండలం ఎన్. హనుమాపురం గ్రామం. గ్రూప్ వన్ లో ఉత్తమ ప్రతిభ కనపరచడంతో మొట్టమొదటి జాయినింగ్ ధర్మవరం నియోజకవర్గ మూ లోని బత్తలపల్లి లో రెండు సంవత్సరాలు ఎంపీడీవో గా విధులు కొనసాగించారు. అనంతరం ధర్మవరం కు ఎంపీడీవో గా బదిలీ అయ్యారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, అధికారులు నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యాలయములోని అధికారులకు సిబ్బందికి సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఉద్యోగి తన విధులను బాధ్యతతో, సేవా భావంతో నిర్వర్తించి మండల, గ్రామ ప్రజలకు మంచి సేవలను అందించాలని తెలిపారు. తాను కార్యాలయ సిబ్బందితో అధికారులతో సమన్వయంతో పని చేస్తూ, అన్ని రాజకీయ పార్టీలతో కార్యాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రణాళిక బద్ధంగా గడువులోగా టీం వర్క్తో సమస్యలను తప్పక పరిష్కరిస్తారని తెలిపారు. మండల పరిధిలోని గ్రామాలలో నీటి కొరత, వీధి దీపాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. వికసిత్ ఏపీలో ఉండేలా మన ధర్మవరం కూడా ఉండేలా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. ఇండస్ట్రీలు కళాకారుల సమస్యలను తీర్చుట, ఉపాధి హామీ, హార్టికల్చర్ తదితర అంశాలలో ప్రత్యేక శ్రద్ధను కరపరిస్తానని తెలిపారు. ప్రతి వ్యక్తికి విద్యా, వైద్యం, ఉపాధి ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. స్వయం ఉపాధిని కల్పించుటలో మెరుగైన పాత్రను అధికారుల ద్వారా వచ్చేలా చేస్తాన ని తెలిపారు. గ్రామ ప్రజలు సమస్యలు పరిష్కరించకపోతే కఠినంగా ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజలకు మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నిర్భయంగా ప్రజలు తమ సమస్యలను తెలుపవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img