London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

పాలస్తీనా దేశ ప్రజలపై ఇజ్రాయిల్ నరమేధం, దురాక్రమణ దాడులను ఆపాలి

ఆల్ ఇండియా తంజీమ్ -ఏ – ఇన్సాఫ్ నగర సమితి డిమాండ్
విశాలాంధ్ర-అనంతపురం : పాలస్తీనా దేశ ప్రజలపై,ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని వెంటనే ఆపాలని భారత కమ్యునిస్టు పార్టీ , మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఏ ఐ వై ఎఫ్, ఏఐఎస్ఎఫ్ ,ఏఐటీయూసీ వామపక్ష ప్రజ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జాతీయ వామపక్షాల దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు అనంతపురం జిల్లా కేంద్రం లోని సప్తగిరి సర్కిల్ వద్ద భారత కమ్యునిస్టు పార్టీ , మైనారిటీ వింగ్ ఇన్సాఫ్ నగర సమితి, ఏ ఐ వై ఎఫ్, ఏఐఎస్ఎఫ్ ,ఏఐటీయూసీ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఇన్సాఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లిపీర ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, ఇన్సాఫ్ నగర అధ్యక్షా కార్యదర్శులు చాంద్ బాషా,సూఫీ ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ… గత సంవత్సరం 7 సెప్టెంబర్ 2023న సామ్రాజ్యవాద అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్ పాలస్తీనా పై దురాక్రమణ దాడి మొదలు పెట్టి నేటికి సంవత్సరం అయిందని,ఈ సంవత్సర కాలంగా అభం శుభం ఎరుగని అమాయక పసి పిల్లలు, వృద్ధులు, మహిళలు పాలస్తీనా సాదారణ పౌరులు మొత్తం 86,000 మందికి పైగా మరణించారని, ఈ ఆధునిక కాలంలో దురాక్రమణ పేరుతో ప్రజలను చంపడం సమంజసమైంది కాదని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్న, ఐక్య రాజ్య సమితి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, అమెరికా దాని మిత్ర దేశాలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాల సంపదలు కుల్లగొట్టడం కై, తమ ఆధిపత్యం కొరకు దురాక్రమణ దాడులు చేయడం సహించరానిదని వారు అన్నారు.
ఉగ్రవాదం పేరుతో ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అమెరికా ఁప్రపంచ ఉగ్రవాదానికే పెద్దన్నగాఁ మారిందని వారన్నారు.ప్రపంచ ప్రజలంతా పాలస్తీనా ప్రజలకు సంఘీ భావం తెలుపుతుంటే, సామ్రాజ్య వాద అహంకారం తలకెక్కిన అమెరికా.. ఇజ్రాయిల్ ను ఎగ దోస్తూ ఆయుధాలను సరఫరా చేస్తూ, నిర్దాక్షిణ్యంగా నిరాయుదులని హతమార్చడం దారుణమైనదని, వెంటనే పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దాడిని నిలిపివేసి ప్రపంచ శాంతికి భాగం కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ నగర్ అధ్యక్ష కార్యదర్శులు5 ఏవైపున నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img