విశాలాంధ్ర /అనంతపురం : అనంతపురం జెఎన్టీయు ఆడిటోరియంలో ఈరోజు మద్యం దుకాణాల టెండర్ల ఓపెన్ లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఆడిటోరియం, పరిసరాలలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చేపట్టిన పటిష్ట బందోబస్తును జిల్లా ఎస్పీ పి.జగదీష్ సమీక్షించారు. తగు సూచనలు కూడా చేశారు. జిల్లా ఎస్పీ వెంట అనంతపురం అర్బన్, రూరల్ డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.