వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ రెస్టారెంట్లో పనిచేశారు. పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్స్ స్టోర్లో ఆదివారం కొద్దిసేపు పని చేశారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ఇరు అభ్యర్థులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా యుక్తవయసులో ఉన్నప్పుడు తాను ఓ మెక్డొనాల్డ్స్లో పని చేశానని డెమోక్రాటిక్పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. ఓ మెక్డొనాల్ట్స్ స్టోర్లో పనిచేసి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.