సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 23వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశమును నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కో ఆప్షన్ మెంబర్లు, మండల పరిధిలోని సర్పంచులు, మండల సాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో అత్యవసరమైన విషయాలపై చర్చించబడునని తెలిపారు.