Friday, October 25, 2024
Friday, October 25, 2024

పరిశ్రమల స్థాపనలకు ప్రోత్సాహం

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 51వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధి అవకాశాలు సృష్టించే తయారీ మరియు సేవారంగ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలని పరిశ్రమల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సాహించాలని ఆదేశించారు. జిల్లాలో 2020-23 మరియు 2023-27 ఇండస్ట్రియల్ పాలసీల నందు 8 యూనిట్లకు గాను రూ.32.62 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. సింగల్ విండో పోర్టల్ లో పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకున్న అనుమతులను నిర్ణీత సమయములో ఆమోదించవలసిందిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు భూగర్భ జల శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్టాండప్ ఇండియా పథకం యొక్క ప్రగతిని మెరుగుపరచాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు మరియు జిల్లా పరిశ్రమల అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజరు జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక పార్కుల స్థాపన ఎంతో అవసరము ఉందని తెలియచేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి జిఎం.శ్రీధర్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ, కమర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్ మురళీమోహన్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డిటిసి వీర్రాజు, ఏపీపీసీబీ ఈఈ ముని ప్రసాద్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, ఏపీఐఐసీ జెడ్ఎం సోనీ, ఎల్డీఎం నర్సింగరావు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఏపీఎస్ఎఫ్సి బిఎం మహేష్, పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, డిపిఓ కార్యాలయం ఏవో నాగరాజు, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, ఫ్యాప్సీ ప్రతినిధి శేషాంజనేయులు, ఫ్యాప్సియా ప్రతినిధి నాగరాజు, డిక్కీ ప్రతినిధి వెంకటేష్, సిక్కి ప్రతినిధి రాజ్ కుమార్, డిఐఏ రెప్రజెంటేటివ్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img