Friday, October 25, 2024
Friday, October 25, 2024

దేహదానంశరీర దానం అన్ని దానాల కంటే గొప్పది

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వం మెడికల్ కళాశాల అనంతపురం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్య రావు అధ్యక్షతన అనాటమీ డిపార్ట్మెంట్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కెడావర్ ఓత్( శవ ప్రమాణం) కార్యక్రమాన్ని అనాటమీ డిపార్ట్మెంట్ డిసెక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ అన్ని దానాల కంటే శరీర దానం (దేహదానం) చాలా గొప్పదని, మనం చనిపోతూ కూడా వైద్య విద్యార్థులు చదువుకోవడానికి మానవ అంతర్నిర్మాణ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి నా దేహం ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించి తన శరీరాన్ని తృణప్రాయంగా చనిపోయిన తర్వాత శరీర దానం చేసి ప్రథమ సంవత్సరం మెడికల్ కాలేజ్ విద్యార్థులు చదువు కోసం దానం చేయడం చాలా గొప్ప విషయమని, ఆ దాతలకు దీనికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు, సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు మెడికల్ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వైద్య విద్యార్థులు అనాటమీ సబ్జెక్టును చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ప్రతిభ కలిగిన ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఈ డిపార్ట్మెంట్లో ఉండడం మీ అదృష్టమని, వారి నుంచి వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు అపారమైన జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలని తెలిపారు. మనకు దానం చేసి మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడే శవాన్ని పవిత్రంగా చూడాలని, వారిని గౌరవించాలని, వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, అనాటమీ నేర్చుకోవడానికి శవమే తొలి గురువని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేహదానానికి తమ వంతు సహాయం అందిస్తున్న సంజీవిని ట్రస్ట్ అధ్యక్షులు రమణారెడ్డిని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ నవీన్, డాక్టర్ సంషాద్ బేగం, డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ తెలుగు మధుసూదన్, ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్, అనాటమీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రనాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ, ట్యూటర్లు పునర్జీవన్ కుమార్, భాను, సంజీవిని ట్రస్ట్ అధ్యక్షులు రమణారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, అనాటమీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు ఆయేషా, మోనాలిసా, కమలాకర్, ప్రసన్న, అధ్యాపకేతర సిబ్బంది లోకేష్, సుబ్బరాయుడు, కెజియ,అజముద్దీన్,ఆర్టిస్ట్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img