Friday, October 25, 2024
Friday, October 25, 2024

ఏ పి సి యూ లో ఐక్యరాజ్య సమితి దినోత్సవం

విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచవ్యాప్తంగా శాంతిని, అభివృద్ధిని సాధించడంలో ఐక్యరాజ్యసమితి పోషించిన కీలక పాత్రను నొక్కి చెబుతూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్ర విభాగం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. విశిష్టఅతిథిగా ఆచార్య షీలారెడ్డి, గౌరవ అతిథిగా ఆచార్య రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు శ్రీ రామకృష్ణ రెడ్డిగారు కన్వీనర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సహాచార్యులు డాక్టర్ బాబు జి. అధ్యక్షత వహించి, స్వాగతోపన్యాసం చేశారు. ఆయన తన ప్రసంగంలో ఐక్యరాజ్యసమితి చరిత్ర, లక్ష్యాలు, ప్రస్తుత స్థితిని వివరిస్తూ, దాని ఏర్పాటుకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని, సంవత్సరాలుగా సాధించిన ముఖ్యమైన మైలురాళ్లను తెలియజేశారు.
గౌరవ అతిథి, ఆచార్య జి. రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ సంస్థల ఆవిర్భావాన్ని, చారిత్రకంగా అభివృద్ధి చెందడంలో అవి పోషించిన ముఖ్య పాత్రలను వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img