Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ప్రజలు నిషేధించాలి..

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలో ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అప్పుడే పర్యావరణం దెబ్బతినదు అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో ఆకస్మికంగా వివిధ వాణిజ్య సముదాయంలో గల దుకాణాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్, అంజుమాన్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ కొత్తపేట లలో ప్లాస్టిక్ మీద రైడింగ్ చేయడం జరిగింది. ఈ రైడింగ్ లో 136 కేజీల ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని, రూ.21,500 జరిమానా విధించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఇకమీదట నిత్యం ప్లాస్టిక్ పై దాడులు ఉంటాయని చిన్న, పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా పూర్తిగా ప్లాస్టిక్ ను విక్రయించరాదని, అలా విక్రయిస్తే కేసులు కూడా కడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img