Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల హామీలపై దృష్టి సారించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర అనంతపురం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు టి రంగయ్య అధ్యక్షతన శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి కేశవరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు టిడిపి జనసేన బిజెపి కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. కూటమి మేనిఫెస్టో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలు హామీలపై దృష్టి సారించాలని సూచించారు. ఒకవైపు పేదల సమస్యలు పీడిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడానికి తప్పు పట్టారు. కేంద్రం ఇచ్చే నిధులు పార్లమెంటు స్థానాల కోసం జనాభా పెంచుకోమని కోరడం ఏమిటని. ఇది చాలా హాస్యాస్పదమన్నారు. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇల్లు స్థలాలు ఇచ్చి చెప్పిన మాట ప్రకారం పేదలకు వెంటనే ఇల్లు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఆయా డిమాండ్లపై నవంబర్ 18వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఎదుట ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ధర్నాలో గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలు, ఇండ్లు లేని నిరుపేదలు వారి వ్యక్తిగత అర్జీలతో వచ్చి ధర్నాలు జయప్రదం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని వ్యవసాయ కూలీలకు కోనేరు రంగారావు భూకమిటీ సిఫార్సుల అమలపరిచి భూమిలేని ప్రతి కుటుంబానికి ఒక హెక్టార్ భూమి ఇవ్వాలనిడిమాండ్ చేస్తూ జరుగుతున్న ధర్నాలో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలలోపాల్గొని జయప్రదం చేయాలనిపిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ పెరుగు సంగప్ప, బండారు శివ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img