Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

అభివృద్ధిలో బాలయ్య మార్క్…

ఏపీలో హిందూపురం మోడల్ గా మారనుందా..
తండ్రి బాటలోనే ప్రజా సేవ చేస్తున్న బాలయ్య..
విశాలాంధ్ర :చిలమత్తూర్ రూరల్..

శ్రీ సత్యసాయి జిల్లా…: ప్రభుత్వం ఏర్పడి న నాలుగు నెలలోనే రూ 100 కోట్లు నిధులు తెచ్చిన బాలకృష్ణ, హిందూపురం నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ కొట్టి అదే స్టైల్ లో అభివృద్ధి కూడా పరుగులు తీ ఇస్తున్నారు, గత రెండు విజయాలకు భిన్నముగా మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి డిఫరెంట్ గా ట్రీట్ చేశాడు ఎమ్మెల్యే బాలయ్య, ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం ను పసుపుమయం చేయాలని కంకణం కట్టుకున్నట్లు సమాచారం, నాటినుండి ఇప్పటివరకు నటుడిగా ,నాయకుడిగా రెండు పడవలపై కాలు పెట్టిన ఆయన, ఇకపై కొత్త రాజకీయ నాయకుడిగా అవతారమెత్తతాడని తెలుస్తుంది. హిందూపురం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆ పెద్దాయన ఏ ముహూర్తంలో పార్టీ పెట్టాడు గాని అప్పటినుంచి నందమూరిపురం గా నిలిచిపోయి సైకిల్ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది, 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలయ్య అరంగేట్రం లోనే విజయాన్ని అందుకొన్నారు, 2019 2024 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ గా నిలిచారు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకొన్నారు ‘ నా ‘ అన్నవారు ఎక్కడ ఉన్నా వారికోసం ఎంత దూరమైన వెళ్తా అన్న సినిమా డైలాగ్ నిజం చేస్తూ ఎక్కడ ఉన్న హిందూపురం ప్రజల బాగోగులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తూ న్నాడు, తమ్ముళ్లకు ఏ కష్టం వచ్చినా బాలయ్య తన వంతు భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నాడు అంతేకాదు తాను అందుబాటులో లేకపోయినా సతీమణి వసుంధర దేవి ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు దీంతో ప్రతి పక్ష నాయకులలో పక్కాగా ఎందుకు చేస్తున్నాడనే ప్రశ్న మిగిలింది. తొలిసారి గెలిచిన సందర్భంలో రూ 195 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ వేపించి శాశ్విత మంచినీటి సౌకర్యం కల్పించారు, నియోజకవర్గంలో వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, 2019 ఎన్నికలలో రాయలసీమ తరపున ఎమ్మెల్యేగా గెలిచినది 17 వేల మెజార్టీతో బాలయ్య ఒక్కరే. ఆ సమయంలో జగన్ వేవులో తన సొంత నిధులతో పురం లో అభివృద్ధి పనులు చేశారు ఈ నేపథ్యంలో ఎట్టకేలకు హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరాలని అప్పటి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది, స్వయంగా రాయలసీమ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి సారించారు బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వాలని వైసిపి జెండా ఎగరవేయాలని కురుబ దీపికమ్మను బరిలో దింపారు, రోజుల తరబడి స్థానికంగా ఉంటూ గ్రూప్ రాజకీయాలను చక్కబెట్టి వైసీపీని బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నారు, అయితే బాలయ్య రాజకీయాలను నిషితముగా గమనించి గెలుపు కోసం పోటీ పడి విజయం సాధించాలనే నెపంతో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులను, కార్యకర్తలను, కుటుంబ సభ్యులను బరిలో దింపి , గతంలో జరిగిన ఎన్నికల కంటే మెజార్టీతో గెలవాలని లక్ష్యముతో ముందుకు సాగారు. ఫలితముగా మూడవసారి మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి విజయదుందబి మ్రోగించారు. అయితే భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయాలని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హిందూపురం పసుపు మయంగా మార్చాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలవపేతం చేయడంతో పాటు సమస్తాగతను పటిష్టం చేయాలని, తెలుస్తుంది. నియోజకవర్గంలోని చిలమత్తూరు లేపాక్షి మండల ప్రజా పరిషత్ లో పట్టు సాధిస్తున్నారు,తండ్రి బాటలోనే బాలయ్య నడుస్తూ భవిష్యత్తులో అడ్డంకులు లేకుండా కార్యక్రమాలు చేయాలని దూర దృష్టిలో ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికలలో ప్రత్యర్థులు లేకుండా చేయాలన్నదే ఆయన ధ్యేయంగా ఉంది. అయితే ఆయన ఆలోచన ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img