విశాలాంధ్ర – కొయ్యలగూడె: (ఏలూరు జిల్లా) : మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు. మండలంలో బయ్యనగూడెం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ పాఠశాల వద్ద కూటమి పార్టీల నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక మొక్కను పెంచాలని, పాఠశాలల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలను తప్పనిసరిగా పెంచాలని, మొక్కలను పెంచడం వలన వాతావరణం లొ మార్పులు వచ్చి, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, మద్దు. తేజ, బాలం. నరేష్, నులకని .శ్రీను, ఆనెం .నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.