ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ నందు విద్యను అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు ద్వితీయ తృతీయ సంవత్సరపు విద్యార్థులు స్వాగత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ సంతోషంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని, చదువుతోపాటు అన్ని విషయాలలో ముందంజలో ఉండే విధంగా అందరూ కృషి చేయాలని తెలిపారు. తదుపరి చదువు పట్ల ఉండాల్సిన వివిధ పద్ధతులను తగిన సూచనలను ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పుష్ప వాహన రెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.