విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : మండలంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎంపీటీసీలకు కనీసం సమాచారం అందజేయట్లేదని, వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి. గంగరాజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీడీవో కిరణ్ కుమార్ ను కోరారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రభుత్వ కార్యాలయాలలో శిలాఫలకాలపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చిత్రపటాన్ని తొలగించడానికి జీవో జారీ చేశారా అని అడగడం జరిగింది. అధికారులు ఎటు సమాధానం చెప్పలేక మిన్న కుండిపోయారు.