Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

మండలానికి 140 క్వింటాళ్ల రాయితీ వేరుశనగ విత్తనాలు మంజూరు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రబీ సీజన్లో పెద్దకడబూరు మండలానికి 140 క్వింటాళ్ల ఖ-6 రకం వేరుశనగ రాయితీ విత్తనాలు మంజూరు అయినట్లు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో క్వింటం వేరుశెనగ విత్తనాలు మార్కెట్ ధర 9600 రూపాయలు కాగా 3840 సబ్సిడీ మినహాయించి రైతు వాటా కింద క్వింటానికి 5600 రూపాయలు చెల్లించి రైతు సేవకేంద్రం లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నేరుగా రైతు సేవకేంద్రాల వద్ద వేరుశెనగ విత్తనం పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ రబీ సీజన్ నుండి పంటల భీమా కొరకు రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించాలని తెలిపారు.పంటల భీమా పధకం కింద అర్హత పొందడానికి శనగకు ఎకరాకు రూపాయలు 420,వరికి రూ.630, జొన్నకు రూ.297, వేరుశెనగ కు రూ.480, ఉల్లి కి రూ.1350 చెల్లెస్తే ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం వర్తిస్తుందన్నారు. అలాగే టమాటా ఎకరాకు రూ.1500 చెల్లెస్తే వాతావరణ ఆధారిత భీమా కింద అర్హులు అవుతారని, రుణాలు తీసుకునే రైతులకి బ్యాంకులే ప్రీమియం చెల్లిస్తాయని స్వచ్ఛందంగా నమోదు చేయదలుచుకున్న వారు బ్యాంకులు లేదా కామన్ సర్వీస్ కేంద్రాలలో ప్రీమియం చెల్లించవచ్చని డిసెంబర్ 31 వ తేదీ లోపల ప్రీమియం చెల్లించి పంటల భీమా పధకం లో అర్హత సాధించాలని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img