ముంబయి : టాటా మోటార్స్ లిమిటెడ్‌కు చెందిన వాహనాల అమ్మకాలు 2024 అక్టోబరులో నిలకడగా కొనసాగాయి. ఈ నెలలో మొత్తం 82,682 యూనిట్లు విక్రయించారు. ఇందులో సీవీ అమ్మకాలు 34,259 యూనిట్లు ఉండగా, పీవీ అమ్మకాలు 48,423 యూనిట్లు ఉన్నాయి. అక్టోబర్ మాసంలో అమ్ముడుపోయిన 82,682 యూనిట్లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించిన విక్రయాలు. వైఓవై మార్పు పెద్దగా లేదు. ఎందుకంటే గత ఏడాది ఇదే నెలలో అటుఇటుగా ఇదేస్థాయిలో అంటే 80,825 యూనిట్లు అమ్ముడుపోయాయి. కమర్షియల్ వెహికల్స్ విషయానికొస్తే, అక్టోబరులో హెచ్‌సీవీ ట్రక్కులు 10,024, ఐఎల్ఎంసీవీ ట్రక్కలు 5,836, ప్యాసింజర్ క్యారియర్లు 2,835, ఎస్సీవీ కార్గో, పికప్ వాహనాలు 10,013 యూనిట్లు మొత్తంగా సీవీ డొమెస్టిక్ 32,708 యూనిట్లు విక్రయించినటుÊ్ల టాటా మోటార్స్ ప్రకటించింది.