Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన మృగాళ్లు అరెస్ట్

చింతపల్లి సబ్ డివిజనల్ అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన మృగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మన్యంలో కనీవినీ ఎరుగని అత్యంత అమానవీయ సంఘటనకు సంబంధించిన వివరాలను చింతపల్లి సబ్ డివిజనల్ అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తన కార్యాలయంలో పాత్రికేయులకు వివరించారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండల పరిధిలోని గిరి గ్రామానికి చెందిన పాంగి రమేష్ (19) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఈ నెల 2 న ఉదయం అందరూ వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఆ బాలికను బలవంతంగా ఒక ఇంటిలోకి ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన బాలిక తన ఇంటిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. దానిని గ్రహించిన యువకుడు తల్లిదండ్రులతో చెబుతుందనే భయంతో తన స్నేహితుడు గెమ్మెలి సీతన్న కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి బాలికను చంపేయాలని నిర్ణయించుకున్నారు. సీతన్న బయట కాపలా ఉండగా రమేష్ ఇంటికి వెనకవైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్లాడు. అతడిని చూడగానే బాలిక కత్తి తీసుకుని అతడిని ప్రతిఘటించింది. దానితో అతడు బాలిక గుండెపై బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు బాలిక ఎముక ఒకటి విరిగి పోగా గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. ఆ అరుపు విని బయట ఉన్న సీతన్న లోపలికి వచ్చాడు. కింద పడి ఉన్న బాలికను చూసి ఎలాగు చంపేస్తాము కదా అని మరలా అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేసి పక్కనే ఉన్న చీరను తీసుకుని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రికరించేందుకు చూశారు. దూలానికి వేలాడుతున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యగా భావించి మరునాడు ఖననం చేశారు. బాలిక ఆత్మహత్యపై పలు అనుమానాలు రావడంతో తల్లిదండ్రులు జీకే వీధి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది, డాక్టర్ల పర్యవేక్షణలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. పోలీసుల రంగప్రవేశంతో భయపడిన నిందితులు విఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. నిందితులపై పొక్సో, మర్డర్ అండ్ రేప్ కేసులు నమోదు చేశామని అదన పీఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. సున్నితమైన కేసును ఛాలెంజ్ గా తీసుకుని నిందితులను గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేసిన తమ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జీకే విధి సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ అప్పలసూరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img