Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

నీట్ – 2024 నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి….

– నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలి

  • పి.డి.ఎస్.ఒ, ఎన్.వై.ఎస్… విద్యార్థి సంఘాలు ….
  • విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : నీట్ – 2024 ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాం లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పి.డి.ఎస్.ఓ), నవ యువ సమాఖ్య (ఎన్.వై.ఎస్) ఆధ్వర్యంలో చోడవరం కాంప్లెక్స్ వద్ద బుదవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ
  • కార్యక్రమంలో పి.డి.ఎస్.ఓ. రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్ మాట్లాడుతూ “దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రాణాలు, లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్, పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. నీట్ పరీక్ష ప్రకటించిన తేదీ (జూన్ 14) కంటే పది రోజులు ముందు (దేశ ఎన్నికల ఫలితాల రోజు) జూన్ 4వ తేదీన నీట్ ఫలితాలను ఎందుకు విడుదల చేశారన్నారు. దేశంలో 67 మంది విద్యార్థులకు 720/720 మార్కులు ఎలా వచ్చాయిని, వారిలోనూ ఆరుగురు ఒకే సెంటర్ విద్యార్థులు కావడం యాదృచ్ఛికమా అన్నారు. ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమాధానం ఇవ్వాలని, బీహార్, గుజరాత్ లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్న మోడీ, నీట్ లో జరుగుతున్న పేపర్ లీకేజీలను మాత్రం ఎందుకు ఆపలేకపోతున్నారన్నారు. పరీక్షా, పే చర్చా అంటూ పరీక్షలు ఎలా రాయాలో చెప్పే మోదీ గారు నీట్ స్కామ్, ఎక్జామ్ లీకేజీలపై ఎందుకు మాట్లాడట్లేదు? అన్నారు. నీట్ ఎక్జామ్ నిర్వహణ, అవకతవకలపై మోదీ మన్ కీ బాత్ ఏమిటి? పేపర్ లీకేజీ స్కాంలలో ఇంకెంత మంది విద్యార్థులు బలైపోవాలని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన స్కాం లను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతుండగా, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటాన్ని ఖండిస్తున్నామన్నారు. కేంద్రీకరణను, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్న నీట్, సి.యు.ఇ.టి తరహా పరీక్షలను రద్దు చేయాలని, వైద్య విద్య ప్రవేశ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కన్వీనర్ పి.మౌనిక, బి.రాజేష్,
  • ఎన్.వై.ఎస్ తరపున కె.రామకృష్ణ, టి.అర్జున్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img