Monday, May 20, 2024
Monday, May 20, 2024

కూటమిలో ముసలం, రాజును ఓడించేందుకు చాప కింద నీరులా పక్కా ప్రయత్నాలు…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా చోడవరం రా(చ)జకేయం రోజుకో రంగు మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు చోడ’వరం’ ఏలిన అధికార, ప్రతిపక్ష నేతల నాడి తెలిసిన నియోజక వర్గ ప్రజలు అభివృద్ది చేసి, చూపించే నాయకత్వం కోసం వేచి చూస్తున్నారు. ప్రాణ మిత్రుని రాజకీయ ఆగమనం కోసం అప్పటి టి.డి.పి. ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడ్ని ధిక్కరించి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు రాజకీయ భిక్ష పెట్టి, అహర్నిశలు కృషి చేసి చోడవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా గోడ గడియారం గుర్తుతో గెలిపించిన గూనూరు మల్లు నాయుడ్ని, గోవాడ సుగర్స్ లో చైర్మన్ పదవి అంటకట్టి, పంచదార అమ్మకాలు లో అవినీతిని వెలుగు లోకి తెచ్చి, మల్లు నాయుడు రాజకీయ జీవితాన్ని బ్రష్టు పట్టించి, మిత్ర ద్రోహానికి పాల్పడిన ఘనత మాజీ ఎమ్మెల్యే రాజు దే అని స్థానిక వెలమ సామాజిక వర్గాలు, మల్లు నాయుడు అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో టి.డి.పి. పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలకు బినామి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసి, సుమారు వెయ్యకు పైగా కుటుంబాల వారిని మోసం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే రాజు గారిదే అని స్థానిక ప్రజా, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటింటికి త్రాగు నీటి కుళాయిలు పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయలు దండుకున్న ఘనత కూడా ఆయనదే అని, రోడ్ల విస్తరణ, హై వే ఏర్పాటు అంటూ దుకాణ దారుల నుండి లక్షలాది రూపాయల ముడుపులు స్వీకరించిన ఘన విఖ్యాతి మన రాజు గారిదే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజక వర్గాన్ని అభివృద్ది చేస్తే ప్రజలు చెప్పిన మాట వినరని, హామీల్లో నే అభివృద్ది చూపిస్తూ ప్రజలను, ఓటర్లను, కాపు వెలమ సామాజిక వర్గాలను సైతం చెప్పు చేతల్లో పెట్టుకున్న మహా నేత, రాజకీయాలకు స్వస్తి అంటూనే, రాజకీయ వారసత్వం మిత్రుడికి ఇచ్చేందుకు, ఇవ్వలేక, రాజ(చ)కీయ కుర్చీ వడల్లేని మన మాజీ రాజు గారు, ” నేనే రాజు, నేనే మంత్రి” అన్న సినిమాలో హీరో మాదిరి చేసెడి రాజకీయ పన్నాగం పట్ల, ఎవ్వరి కైతే అన్యాయం జరిగిందని భావించిన నేతలు తిరిగి అతడ్ని ఈ సారి ఎన్నికల్లో కూటమిగా ఓడించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జగమెరిగిన బహిరంగ రహస్యం అని సీనియర్లు, స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img