విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : చోడవరం మీదుగా కారులో సుమారు 250 కేజీల గంజాయి తరలిస్తున్న అక్రమార్కుల ను చోడవరం పోలీసులు శనివారం వలపన్ని పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి చోడవరం మీదుగా పట్టణానికి అక్రమంగా గంజాయి కారులో తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి పట్టుకున్నారు. స్టేషన్ సీఐ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై డి.శేఖర్ బాబు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసారు. కారు, గంజాయి సీజ్ చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.