Monday, May 20, 2024
Monday, May 20, 2024

డ్రైనేజీ లుగా మారిన రహదారులు… – కుంటుపడుతున్న ప్రజారోగ్యం ఆందోళనలో మహిళలు, ప్రజా సంఘాలు ….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో రహదారులన్నీ డ్రైనేజీలను తలపిస్తున్నాయని మహిళా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి చోడవరం నుండి పి ఎస్ పేట వెళ్లే రహ దారిలోను, చోడవరం మాడుగుల బియ్యం రోడ్లో కాంప్లెక్స్ దాటాక రత్నం రెస్టారెంట్ సమీపంలో డ్రైనేజీలు లీకై ప్రధాన రహదారులు గ్రామీణ రహదారులను డ్రైనేజీలుగా మారు మారుతున్నాయ డ్రైనేజీ లీకై రోడ్డు మీదకు విపరీతమైన కుళ్ళు బురదలు నీరు వస్తుందని, దీన్ని తక్షణమే అరికట్టాల్సిందిగా వామ పక్ష మహిళా ప్రజా సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. మేజర్ పంచాయితీలో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, చిద్రమైన రహదారులు, కనీసం డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగు నీరు తదితర సమస్యలను తీర్చలేని పరిస్థితిలో చోడవరం పంచాయతీ దిగజారిందని, ప్రజా సమస్యలపై పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అన్నారు. ప్రజా సమస్యలపై పలు మార్లు పంచాయతీ కార్యనిర్వహణాధికారి (ఈ.వో), పాలకమండలి సర్పంచ్ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తరచూ ప్రజలు, విద్యార్థులు వచ్చి వెళ్లే రహదారిలో డ్రైనేజీ సమస్య కారణంగా పలువురు ఇబ్బంది పడు తున్నారు అని సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి
ఆరోపిస్తున్నారు. కనీసం డ్రైనేజీలో బ్లీచింగ్ గాని దోమల మందు కానీ కొట్టి చాలాకాలం అయిందని వేసవికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని కనీసం బ్లీచింగ్ కొట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చోడవరంలో ఉన్న పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img