విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : రాష్ట్రంలోని స్వయం భూ దేవాలయాలు అన్నింటిలో అత్యంత మహిమాన్వితమైన చరిత్ర ప్రసిద్ధి చెందిన అనకాపల్లి జిల్లా చోడవరం స్వయం భూ పురాణ గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానంలో నూతన ఉత్సవ కమిటీ శనివారం కొలువుదీరింది. స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఆధ్వర్యంలో నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ గా గూనూరు సురేష్ కమిటీ సభ్యులు గా 35 మందిని ఎంపిక చేసారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఉత్సవ కమిటీ చే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించి, భాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ గూనూరు సురేష్ మాట్లాడుతూ తమను నమ్మి భాద్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రాజుకు ధన్యవాదాలు తెలిపారు. తమ శక్తి వంచన లేకుండా గౌరేశ్వర స్వామి ఉత్సవాలను అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ సురేష్ ను ఎమ్మెల్యే తో బాటు పలువురు టి.డి.పి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, రైతు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లు నాయుడు, పదవ వార్డు మెంబర్ నేమాల హరి, ఆలయ ఈ.ఓ. ఎస్.వి.వి సత్యనారాయణ, ప్రధాన అర్చకులు కొడమంచలి చలపతిరావు, వెంకటరావు, శ్రీనివాసరావు, సహాయ అర్చకులు సంగీశ విఘ్నేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.