విశాలాంధ్ర – అనంతపురం : ఈ ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ (ఏ ఆర్ పీసీ 729) కుటుంబానికి కార్పస్ ఫండ్, విడో ఫండ్ ల కింద మొత్తం రూ. 1.50 లక్షల విలువ చేసే చెక్కులను జిల్లా ఎస్పీ గౌతమిసాలి మృతుడి భార్య రాధకు శనివారం అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం బి సూపరింటెండెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.