London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

కేసులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : కంటెంప్ట్ కేసులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో కంటెంప్ట్ కేసులపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటెంప్ట్ కేసులు కోర్టులో నమోదైన వెంటనే చొరవ తీసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు కంటెంప్ట్ వరకు పోకూడదని, ముందుగానే వాటి పరిష్కారానికి దృష్టి సారించాలని, ఒకవేళ కోర్టు కేసులు కంటెంప్ట్ వరకు వచ్చినా వెంటనే దానిని పరిష్కరించి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో కంటెంప్ట్ కేసులను ఎలాంటి పెండింగ్ ఉంచుకోరాదని, సకాలంలో పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పరిధిలో కంటెంప్ట్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్.అండ్.బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిటిసి వీర్రాజు, మైన్స్ డిడి నాగయ్య, డిఎండబ్ల్యూఓ రామ సుబ్బారెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిసిఓ అరుణకుమారి, డిఎస్ఓ శోభారాణి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img