Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

13 న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు

డి ఎం అండ్ హెచ్ ఓ,డాక్టర్, ఈబీ దేవి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 13వ తేదీన పార్లమెంట్ కు మరియు అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కు సంబంధించి జిల్లాలో 21 25 పోలింగ్ కేంద్రాలు నందు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు ఆదేశాలు ఇచ్చారని ముఖ్యంగా
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు( ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ) ఏర్పాటు చేయాలన్నారు. ఈ కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
వైద్య సిబ్బంది తగిన ప్రథమ చికిత్స మందులతో చికిత్స అందించాలని,
ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నందు చికిత్స అందించలేని సందర్భంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలని కోరారు
ప్రతి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నందు ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని తప్పనిసరిగాఉంచాలని,
-కోవిడ్ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రథమ చికిత్స కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వైద్యాధికారులు తగు శిక్షణ ఇవ్వాలన్నారు.
13వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులు మరియు ఇతర సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలన్నారు.
ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయబడదు అన్నారు,
జిల్లాలో ఏ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత ,డాక్టర్ యుగంధర్ , డా అనుపమ జేమ్స్ ,డా నారాయణ స్వామి ,డాక్టర్ రవిశంకర్ ,డి ఎం ఓ .ఓబులు, ఎస్ ఓ .మహమ్మద్ రఫీ, ఫార్మసీ ఆఫీసర్ రమాశంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img