London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : స్టాండప్ ఇండియా పథకం కింద అందించిన సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లో స్టాండప్ ఇండియా పథకం కింద మంజూరైన రాజమ్మ ఎంటర్ప్రైజ్ మరియు సర్వీసెస్ యజమానురాలు రాజమ్మకి సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ అందచేశారు.
ఈ వాహనానికి కెనరా బ్యాంకు, ఎస్ ఎం ఈ బ్రాంచు, అనంతపురము వారు ఋణాన్ని స్టాండప్ ఇండియా పథకం క్రింద మంజూరు చేశారు. ప్రాజెక్టు విలువ రూ.48.00 లక్షలకుగాను కెనరా బ్యాంకు వారు రూ.36.00 లక్షలు ఋణాన్ని ఇవ్వడము జరిగింది. ఈ వాహనమునకు ఇండస్ట్రియల్ పాలసీ 2023-27 పాలసీ లో 45 శాతం సుమారు రూ. 21.00 లక్షలు పెట్టుబడి రాయితీని జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యములో జరిగే డి ఐ ఈ పి సి సమావేశములో మంజూరు చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్టాండప్ ఇండియా పథకం కింద జిల్లాలోని ప్రతి బ్యాంకు బ్రాంచు వారు కనీసం ఇద్దరికీ (ఒక ఎస్ సి / ఎస్ టి + ఒక మహిళ) ఖచ్చితముగా ఈ ఆర్ధిక సంవత్సరములో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎల్డిఎంని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి. నాగరాజారావు, ఇండియన్ నర్సింగ్ రావు, బ్యాంక్ మేనేజర్ రాహుల్, మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img