Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఓటు ఎంతో విలువైనది

ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి
: జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఓటు ఎంతో విలువైనదని, ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఎన్నికల సింబల్స్ పై మహిళలకు నిర్వహించిన రంగోళి పోటీలలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో బాధ్యతగా ఓటు వేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, మే 13వతేదీన పోలింగ్ రోజు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మీ ఇంట్లో వారు, బంధువులు, మీ వీధిలోని వారు ప్రతి ఒక్కరి చేత ఓటు వేయాలని తెలియజెప్పాలన్నారు. మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో ముందుగానే తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో, సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. రంగోళి పోటీలలో 80 మందికిపైగా పాల్గొనగా, ఓటు హక్కు విలువను తెలిసేలా ముగ్గులను వేసిన వాటిలో మొదటి బహుమతిని పార్వతి, రెండవ బహుమతిని ఉమ, మూడవ బహుమతిని చంద్రిక టీమ్ గెలుచుకోగా, నగదు బహుమతులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి.వెంకటేష్, జడ్పి డిప్యూటీ సిఈఓ లలితాబాయి, మెప్మా పిడి విజయలక్ష్మి, తహసీల్దార్ శివరామిరెడ్డి, మెప్మా మహిళలు, వివిధ స్వచ్ఛంద సంస్థల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img