London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అమరావతి రాజధానికి పెన్షన్ డబ్బును విరాళంగా ఇచ్చిన మహిళ

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయంలో అందరికీ సమ న్యాయం చేస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొన్నది. ఈ సందర్భంగా పట్టణంలోని శివా నగరకు చెందిన నారాయణమ్మ అనే మహిళ మంత్రి సత్య కుమార్ యాదవ్ పెన్షన్ పంపిణీలో కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు తనకు వచ్చిన పింఛన్ డబ్బు రూ.7,000 వెంటనే తిరిగి సత్య కుమార్ యాదవ్ కు ఇచ్చారు. తనంతరం ఆ మహిళ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అని, తన వంతుగా తనకు వచ్చిన పెన్షన్ను విరాళంగా అందజేస్తున్నట్లు వారు తెలుపుతూ ఆ నగదును మంత్రికి అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మున్ముందు కూడా తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆ మహిళకు పేర్కొన్నది. నాకు చదువు సంధ్యలు అంతగా తెలియవని మా ఇంటిలో పిల్లవాళ్ళు రాజధాని గురించి మాట్లాడుకుంటుంటే అమాయకంగా వింటుండే దానినని, ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటేనే రాష్ట్ర ప్రజలు సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్రానికి రాజధాని తల్లి లాంటిది అని తెలిపారు. రాజధాని నిర్మాణంలో తాను భాగం కావాలని తలంచే ఈ విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిటాల శ్రీరామ్ బిజెపి నాయకులు ఆ మహిళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. అనంతరం సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ నారాయణమ్మ ఇచ్చిన ఈ విరాళం అందరికీ స్ఫూర్తి కావాలని, రాజధానికి తన వంతుగా విరాళం ఇవ్వడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆమె దాతృత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలను తెలుపుతున్నామని తెలిపారు. ఆమె ఆశీర్వాదం త్వరలోనే రాజధానికి పునర్ వైభవం కలగాలని వారు తెలిపారు. నారాయణమ్మ కుటుంబ సభ్యులకు కూడా ఆమెను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img