Friday, October 25, 2024
Friday, October 25, 2024

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అవగాహన కల్పించాలి

— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు అవగాహన చేయాలని జిల్లా ఎస్పీ పి జగదీష్ పిలుపునిచ్చారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పాల్పడే సైబర్ నేరాలను అరికట్టడంలో అందరి పాత్ర ఎంతైనా ఉందన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ” సైబర్ నేరాల నివారణలో యువత పాత్ర” అనే అంశంపై వ్యాసరచన నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచి సమాజం నిర్మించడంలో విద్యార్థుల, యువత పాత్ర కీలకమైందన్నారు. క్రమశిక్షణతో చదవడమే కాకుండా సత్ప్రవర్తనతో తల్లిదండ్రుల ఆశయాలకు చేరువ కావాలన్నారు. చెడును దూరం చేసుకుని మంచికి బాటలు వేయాలన్నారు. ఈకార్యక్రమంలో అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు, త్రీటౌన్ సి.ఐ శాంతిలాల్ , ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , ఆనంద్, లక్ష్మినారాయణ, ఆర్ ఎస్ ఐ లు మగ్బూల్, జాఫర్, రమేష్ నాయక్ మరియు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img