విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో లత్తవరం రోడ్డు (సోమన్న కుంట) పక్కన గల వీరశైవ కులస్తుల రుద్రభూమి( స్మశాన వాటిక) నందు అంత్యక్రియలు నిర్వహించుకోవడం జరుగుతున్నదని అయితే అక్కడ నీటి సౌకర్యం బోరు సిస్టం ట్యాంక్, వెలుతురు కోసం లైట్ పోల్స్,మరి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ తోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉరవకొండ సర్పంచ్ లలితమ్మ, కార్యదర్శి గౌస్ సాహెబ్ కి గురువారం జరిగిన గ్రామసభలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు నాగన్న గౌడ్ గంగాధర్, మోపిడి చంద్ర, పాటిల్ నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు