London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 344 ఫిర్యాదులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిపిఎం ఆనంద్, ఎస్డిసి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ ను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, డిటిసి వీర్రాజు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, డిసిఓ అరుణకుమారి, డిఎస్ఓ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img