London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఘనంగా జరిగిన డాక్టర్స్ డే వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే వేడుకలు ఆసుపత్రి వైద్యులు, హెడ్ నర్సులు, నర్సులు, కార్యాలయ సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, డిప్యూటీ డి ఎం హెచ్ వో సాల్వియా సాల్మన్ ఆధ్వర్యంలో ఈ డాక్టర్స్ డే వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైద్యులు కార్యాలయ సిబ్బంది ఒకరినొకరు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకొని, వాటి ప్రాధాన్యతను తెలుసుకున్నారు. అనంతరం సూపర్డెంట్ మాధవి తోపాటు పలువురు వైద్యులు మాట్లాడుతూ మనం చేస్తున్న ఈ వైద్య వృత్తి భగవంతుడు ఇచ్చిన సేవగా పరిగణించాలని, బిల్ అండ్ బెల్ అనేది మన వైద్య వృత్తిలో లేదని, రోగు యొక్క ఆరోగ్యమే మన లక్ష్యంగా అందరూ వైద్య వృత్తిని చేపట్టాలని తెలిపారు. వైద్య వృత్తిలో మరింత పరిజ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే ప్రజల్లో మనకు మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఏ రోగికి ఎటువంటి వైద్య చికిత్స చేయాలో ఆ విషయాన్ని తెలుసుకుంటూ విద్యార్థిగా వైద్య వృత్తిలో కొనసాగాలని తెలిపారు. వైద్యో నారాయణో అని పెద్దలు అన్నారని, ఆ సూక్తిని అందరూ కూడా పాటించి అమలు చేసేలా చూడాలని వారు కోరారు. ప్రజలు మనల్ని భగవంతుని స్వరూపులుగా భావిస్తారని, వారి కష్టాన్ని మన గుర్తించి సరియైన ఆరోగ్యాన్ని ఇవ్వడమే డాక్టర్ల యొక్క ముఖ్య లక్ష్యము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీర్, డాక్టర్ వెంకటేశులు, డాక్టర్ వివేకుల్లయప్ప, డాక్టర్ శైలజ, డాక్టర్ హరి శ్రీనివాస్, డాక్టర్ వంశీ, డాక్టర్ నితిన్ కుమార్, డాక్టర్ అనిల్, డాక్టర్ సురేష్, డాక్టర్ కిరణ్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ చంద్రిక, డాక్టర్ నివేదిత, డాక్టర్ శర్వాణి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img