విశాలాంధ్ర- ఉరవకొండ : వైఎస్ఆర్సిపి పార్టీ యువ నేత వై. నిఖిల్ నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖిల్ రెడ్డి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆయన అభిమానుల ఆకాంక్షించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు