Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం :ఆంధ్రప్రదేశ్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ Act 2002 & రూల్స్ 2007 జిల్లా స్థాయి సలహా కమిటీ & జిల్లా రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సంయుక్త సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రతి ఆసుపత్రి నిర్వాహకులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్స్ అప్నా, ఐయంఏ డాక్టర్స్ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తకు తీసుకోవాలని, స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు వైద్య సేవలు అవసరమైన గ్రామాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన ఆయా గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ కమిటీకి సంబంధించి ఒక వాట్సప్ గ్రూపును తయారు చేయాలని, దానిలో కమిటీ సభ్యులు సూచనలు, సలహాలు ఒకరికి ఒకరు చర్చించుకుని జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని, అన్ని ఆసుపత్రి నందు డిస్ప్లే బోర్డులు ఉంచాలని, అందులో సమయము, డాక్టర్ చదివిన సర్టిఫికెట్లు వివరాలు, ఎన్ని రూమ్స్, బెడ్స్, వాష్ రూమ్స్ ఆసుపత్రికి సంబంధించిన తదితర అంశాలను ఉండేలా చూడాలన్నారు. అలాగే జిల్లాలోని 528 ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయు విధంగా ఎక్స్ ఎల్ షిట్ నందు నమోదు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యులు, ప్రవేట్ వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బంది సమిష్టిగా కృషిచేసి జిల్లాలోని ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలవాలని, మెరుగయిన వైద్య సేవలు అందించాలని, మరి ముఖ్యంగా మహిళలు, శిశువులకు సంబంధించి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూసి అనంతపురం జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని ఆ విధంగా కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మురళీకృష్ణ, ఆప్నా ప్రెసిడెంట్ డాక్టర్ విజయకుమార్, డాక్టర్ తామస్ రెడ్డి, డాక్టర్ శ్రీనాథ్ ఆర్ డి టి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవి ప్రసాద్ రావు, లీగల్ అడ్వైజర్స్ రామ్ కుమార్, కన్స్యూమర్ ఫోరం కృష్ణమూర్తి, ఎన్జీవో భానుజా, జిల్లా సమైక్య అధ్యక్షులు షాకుంభి, ఉపాధ్యక్షులు రాధమ్మ, వైద్య శాఖ డెమో త్యాగరాజు, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్, ఆరోగ్య బోధకులు వేణు, విజయ్ కుమార్,వెంకటేష్, శ్రీకాంత్ మొదలగు వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img