Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలి

ఎన్నికల కమిషన్ సూచనలను తూచా తప్పకుండా పాటించాలి : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం ఏఈవోలు మరియు అకౌంటింగ్ టీమ్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో వీడియో సర్వేలెన్స్ టీంలు (విఎస్టీ), వీడో వీవింగ్ టీం (వివిటీ), ఫ్లయింగ్ స్క్వాడ్ (ఎఫ్ఎస్), స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు (ఎస్ఎస్టీ), మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి), అసిస్టెంట్ ఎలక్షన్ అబ్జర్వర్ (ఏఈవో), ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ తో అకౌంటింగ్ టీం సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 95 లక్షల రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 40 లక్షల రూపాయలు అభ్యర్థులు వ్యయ ఖర్చు చేయాలని ఎన్నికల కమీషన్ సూచించడం జరిగిందని, అందుకు లోబడి అభ్యర్థుల వ్యయ ఖర్చు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు అనధికారికంగా, లోపాయికారీగా చేస్తున్న వ్యయ ఖర్చు వివరాలు పర్యవేక్షిస్తూ చెప్పిన పరిమితులకు మించి ఖర్చు చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అధికారులపై ఉందన్నారు. అభ్యర్థుల అందరి వివరాలు అధికారులతో ఉండాలని, ప్రతి అంశంపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్స్పెండిచర్ సున్నితమైన నియోజకవర్గాలలో మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో అకౌంట్స్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధులపై ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం ఏఈవోలు మరియు అకౌంటింగ్ అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ప్రతిరోజు రిపోర్టు ఎలా ఏ ఫార్మేట్ లో పంపించాలి, ఆర్ఓ ఎన్ని రోజులకు ఒకసారి తనిఖీ చేస్తారు, తదితర అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ఒకసారి ఎన్నికల విధులు కేటాయించిన తర్వాత వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే నోడల్ అధికారులతో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు ఎవరు, వారి వ్యయ ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొత్త రకాల మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంటుందని, వ్యయ ఖర్చులపై నిత్యం దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఇందిర, లోకల్ ఫండ్ ఆఫీసర్ శివారెడ్డి, జిల్లా కోపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ నాగరాజులు శిక్షణ నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఏఈవోలు మరియు అకౌంటింగ్ టీమ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img