Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజ్యాంగ విలువలతో జీవించండి

విశాలాంధ్ర : నందవరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రతి ఒక్కరు జీవించాలని దేశాయ్ నెట్వర్క్ అధినేత దేశాయ్ గురురాజరావు అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన నాయకుడు కాదని ఆయన అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన నాయకుడని ఆయన జీవన విధానాలు ఆయన ఆలోచనలు నేటి యువతకి ఎంతో ఆదర్శమని కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతుకుతున్నారనికొనియాడారు. నేటి సమాజంలో ప్రతిఒక్కరూ అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, దేశాయ్ యూత్ పాండు, రవి,కాశిం,శివ,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img